తిరుపతమ్మను దర్శించుకున్న ట్రైనీ కలెక్టర్లు
NTR: ఏపీకి నూతనంగా నియమితులైన ట్రైనీ కలెక్టర్లు ఆదివారం పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండ్ల అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కలెక్టర్లు వారం రోజులపాటు మండలంలో పర్యటించనున్నారు.