నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2,498 క్యూసెక్కుల వరద
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో ఖరీఫ్ సీజన్‌లో 81 రోజులకు పైగా వరద నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం వరకు ప్రాజెక్టు జలాశయంలోకి 2,498 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. వస్తున్న వరదను ఒక గేటు ద్వారా మంజీరా నుండి గోదావరిలోకి వదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.