ద్వారకాతిరుమల ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల
ELR: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి రోడ్డు నిర్మిస్తానని చెప్పారు. దీంతో సోమవారం ఆలయ అభివృద్ధికి రూ.8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అయినట్లు తెలిపారు.