VIDEO: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

VIDEO: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

NZB: మాక్లూర్ మండలం కొత్తపల్లిలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ సాయంత్రం స్కూల్ బస్సును వడ్ల లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. బస్సులోని స్కూల్ పిల్లలు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.