కుళ్లిన గుడ్లతో కప్ కేక్స్

కుళ్లిన గుడ్లతో కప్ కేక్స్

HYD: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కాటెదాన్‌లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 'మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ' పేరుతో అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కప్ కేకులు తయారు చేస్తున్న ఈ ముఠా అక్రమాలను మెరుపు దాడిలో గుర్తించారు. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తుంది.