'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
NTR: సన్నద్ధతా చర్యల్లో భాగంగా రబీ సీజన్‌కు వివిధ రకాల ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నామని కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. శనివారం కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెలకు 17,812 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా ప్రస్తుతం 27,542 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.