పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఎల్లంపల్లి

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఎల్లంపల్లి

MNCL: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.92 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 19.9531 క్యూసెక్కుల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 31276 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.