నకిలీ మద్యం కేసు.. మరో ఇద్దరు అరెస్ట్
AP: నకిలీ మద్యం కేసులో పోలీసులు మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆయన తమ్ముడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలిస్తున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 20కి చేరగా.. జోగి రమేశ్‌ను ఏ18గా చేర్చే అవకాశం ఉంది.