'నీటి సమస్య తలెత్తకుండా చూడాలి'
MNCL: గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచులు శ్రద్ధ పెట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే కోరారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జన్నారం దస్తురాబాద్ మండలాలకు సంబంధించిన గ్రామ సర్పంచులతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీటి వనరులకు తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు.