'స్మార్ట్ కిచెన్‌లను రద్దు చేయాలి'
AKP: స్మార్ట్ కిచెన్లను రద్దుచేసి మధ్యాహ్న భోజన పథకాన్ని బలోపేతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పరవాడలో మధ్యాహ్నం భోజన పథకం కార్మికులతో సమావేశం నిర్వహించారు. స్మార్ట్ కిచెన్‌ల కారణంగా వేలాదిమంది కార్మికులు రోడ్డును పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.