యువత మరిన్ని ఉద్యోగాలు సాధించాలి

రంగారెడ్డి: యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తేరటీ నరసింహ, సింహాద్రి, రమేష్‌లను గ్రామ ప్రభుత్వ ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ యువత బాగా చదువుకుని మరిన్ని ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రిశేఖర్, రావుల విద్యాసాగర్, మండల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.