VIDEO: నర్సాపూర్‌లో వైభవంగా గంగమ్మ బోనాలు
NRML: నర్సాపూర్‌లో గంగపుత్ర కులస్తులు శుక్రవారం గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి గంగమ్మ ఆలయం వరకు మహిళలు తలపై బోనాలతో భారీ ఊరేగింపుగా వెళ్లారు. మంగళవాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య సాగిన ఈ ప్రదర్శనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.