గంజాయి అమ్మకాలు.. నిందితుడి అరెస్ట్

గంజాయి అమ్మకాలు.. నిందితుడి అరెస్ట్

HYD: కార్వాన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు చేశారు. ధన్ రాజ్ సింగ్ గంజాయి అమ్మకాలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల నగదుతో పాటు 1.904 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.