ద్వారకాతిరుమల ఆలయ ఉద్యోగి సస్పెండ్

ELR: ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో రూ.9వేలు స్వాహా చేసిన రికార్డు అసిస్టెంట్ అనుమంచిపల్లి సాయి రామానుజన్ ను సస్పెండ్ చేస్తూ ఈవో ఎన్.వి.ఎస్.ఎన్. మూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ కాంప్లెక్స్‌లో ఒక షాపు అద్దె సొమ్ము రూ.51 వేలు వసూలు చేసి, అందులో రూ.9 వేలు స్వాహా చేసినట్లు తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈవో వెంటనే చర్యలు తీసుకున్నారు.