ఏటీఎం మిషన్ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
HNK: కాజీపేట మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి SBI ATM మిషన్ ధ్వంసం చేశారు. మిషన్‌లో డబ్బులు చోరీ చేయడం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కాజీపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలతో పాటు ఆధారాలను సేకరిస్తున్నారు.