అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం
NRML: దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిషోర బాలికలకు అన్నప్రాచనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీవో గోవర్ధన్ కార్యక్రమానికి హాజరై చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.