7న వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై రక్తదాన శిబిరం

HNK: కాజీపేట మండలం వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై ఈనెల 7వ తేదీన ఉదయం 7 గంటలకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లేపల్లి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ స్మారక వైద్యశాల రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో జరుగు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని మండల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.