సర్పంచ్ చొరవతో నీటి సమస్య పరిష్కారం

ప్రకాశం: కనిగిరి మండలం యేరువారిపల్లి గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ లైన్ చెడిపోవడంతో బుధవారం నీటి సరఫరా ఆగిపోయింది. గ్రామ సర్పంచ్ వెంకటయ్య విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు లైన్ మాన్‌ని పంపించి ఎల్‌సిని ఇప్పించారు. కాశీయ్య సహాయంతో త్రీ పేస్ లైన్‌కి మరమ్మత్తులు చేయించారు. సర్పంచ్ వెంటనే నీటిని విడుదల చేయించారు.