'రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించాలి'
SRCL: జిల్లాలోని వీర్నపల్లి రైతు వేదికలో గురువారం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోవర్ధన్ సూచించారు. ఈ ప్యాకెట్లలో టమాట, బెండ, మిరప, తోటకూర, పాలకూర విత్తనాలు ఉన్నాయని, ఒక్కో ప్యాకెట్ 20 గుంటల భూమికి సరిపోతుందని తెలిపారు.