ఎన్బీటీ నగర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల తాకిడి

ఎన్బీటీ నగర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల తాకిడి

HYD: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు ఉదయం నుంచే భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఎన్బీటీనగర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.