VIDEO: మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించిన కలెక్టర్
PLD: పల్నాడు వీర వనిత నాయకురాలు నాగమ్మ 11వ శతాబ్దంలో దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించిన చెన్నమల్లికార్జున స్వామి దేవాలయాన్ని పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. దేవాలయ అభివృద్ధి కమిటీ విజ్ఞప్తి మేరకు, దేవాలయ పరిధిలో ఉన్న 18 ఎకరాలను కమిటీకి అప్పగించే అంశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.