VIDEO: ఆదోని జిల్లా కోసం సంఘీభావ ర్యాలీ
KRNL: ఆదోని జిల్లా సాధనకు మద్దతుగా కౌతాళంలో స్థానిక ప్రజా సంఘాలు, యువజన సంఘాలు బుధవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆదోని జిల్లా ఏర్పాటే పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దారి తీస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొని నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ నాయకులు తెలిపారు.