డెంకాడలో 'పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన' ప్రారంభం
VZM: పేద కుటుంబాల విద్యుత్ కష్టాలను తీర్చి వారి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన' పథకాన్ని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి డెంకాడ గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సోలార్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.