'జర్నలిస్టులకు టోపీలు పంపిణీ'

NDL: పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినపుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని మున్సిపల్ కమిషనర్ బేబి అన్నారు. శనివారం నందికోట్కూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేశారు.