నీటి మునిగిన పంట.. కన్నీరు పెడుతున్న రైతులు

నీటి మునిగిన పంట.. కన్నీరు పెడుతున్న రైతులు

VZM: బుచ్చి మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు వరి పంట నీట మునిగింది. పంట నష్టపోయామంటూ పెనుబల్లి గ్రామ రైతులు కన్నీరు మున్నిరు అవుతున్నారు. నాలుగు రోజుల్లో పంట చేతికి వస్తుందని అనుకునే లోపే వర్షం దాటికి నష్టపోయాము అని వాపోయారు. దళారులు ధాన్యం తడిస్తే తీసుకోమని చెప్పి మొహం చాటు వేస్తున్నారన్నారు. ప్రభుత్వమే తమను అన్ని విధాల ఆదుకోవాలి విజ్ఞప్తి చేశారు.