పాక్ నుంచి తిరిగొచ్చిన జవాన్

భారత BSF జవాన్‌ను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత జవాన్ పూర్ణమ్ కుమార్ షా దాయాది దేశం నుంచి బయటపడ్డారు. అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన పూర్ణమ్ షా అక్కడ బందీగా ఉండిపోయారు. దౌత్యపరమైన చర్యల అనంతరం పాక్.. అతన్ని రిలీజ్ చేసింది. అటారీ బార్డర్ వద్ద షాను భారత్‌కు అప్పగించగా.. పాక్ రేంజర్‌ను కేంద్రం ఆ దేశానికి పంపించింది.