అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు

అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు

RR: రాజేంద్రనగర్ లోని హైదర్ గూడలో గల ఓ అపార్ట్‌మెంట్ ప్లాట్‌లో ఉన్న ప్రేరణ క్రియేషన్ ఆర్ట్ అకాడమీ స్టూడియోలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. పూజ గదిలో దీపం పెట్టడంతో పక్కనే ఉన్న ఓ పేపర్‌కు మంటలు అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.