మార్గంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి

KNR: స్మార్ట్ సిటీ పరిధిలోని గాంధీ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు నూతనంగా నిర్మించిన రోడ్డు మార్గంలో స్పీడ్ బ్రేకర్లు, వైట్ లైనర్స్ ఏర్పాటు చేయాలని కోరుతూనేడు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కొత్తగా నిర్మించిన రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు.