సింగరేణి ఉద్యోగులకు కబడ్డీ పోటీలు ప్రారంభం

PDPL: రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వర్క్ పీపుల్ స్పోర్ట్స్, గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సెంటినరీకాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి ఉద్యోగులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఏరియా ఇంజనీర్ యాదయ్య పోటీలను ప్రారంభించారు. సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఏడాది వివిధ క్రీడలలో పోటీలను నిర్వహిస్తుందన్నారు.