విమాన ప్రయాణికులకు శుభవార్త..!
కృష్ణా: రాష్ట్ర విమాన ప్రయాణికులకు శుభవార్త. గన్నవరం నుంచి సింగపూర్‌కు వెళ్లే విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ఇకపై వయబులిటీ గ్యాప్ ఫండింగ్ లేకుండానే వారంలో మంగళ, గురు, శనివారాల్లో సింగపూర్‌కు సర్వీసులు నడపనుంది. ఈ ఆవకాశాన్ని వినియేగించుకోవాలని ప్రయాణికులను కోరింది.