'కుష్టువ్యాధి సర్వేకి ప్రజలు సహకరించాలి'
ADB: కుష్టువ్యాధి సర్వేకి ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ అన్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కుష్టువ్యాధిపై వైద్య బృందంతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి డిసెంబర్ 31వ తేది వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు.