'ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత'
ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోనాల మండలం సాకేర గ్రామంలో ఏర్పాటుచేసిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమని పేర్కొన్నారు.