రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. అర్ధరాత్రి మహాలక్ష్మి వాడ, శాంతినగర్, ఎస్సీ కాలనీలలో షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్పీ హెచ్చరించారు. రాత్రి సమయంలో పోలీస్ సబ్బంది పటిష్టంగా గస్తీ నిర్వహించాలని తెలిపారు.