ప్రజలంతా ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టాలి: DMHO
HNK: జిల్లాలో 25 గ్రామాలను హై రిస్క్ గ్రామాలుగా గుర్తించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (DMHO) అప్పయ్య తెలిపారు. వంద రోజుల్లో 14 ఏళ్లు పైబడిన వారందరినీ పరీక్షించి, ఎక్స్‌రే, సీబీ నాట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలంతా ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టాలని, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లాలని DMHO సూచించారు.