ఓటీటీలో రికార్డు సృష్టించిన 'D/O ప్రసాద్‌రావు'
ప్రముఖ OTT వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న 'D/O ప్రసాద్‌రావు కనబడుటలేదు' వెబ్ సిరీస్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫిబ్రవరి 27న ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్‌కు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.