రైతులకు డబ్బులు పడలేదు: కోవూరు MLA
NLR: DRC మీటింగ్‌లో రైతుల సమస్యలపై కోవూరు MLA వేమిరెడ్డి మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు జమ కాలేదని తెలిపారు. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా డబ్బులు పడటం లేదని త్వరతగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ హిమాన్‌షు శుక్లా మాట్లాడుతూ.. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు.