రేషన్ సక్రమంగా ఇవ్వకుంటే చర్యలు: జేసీ

రేషన్ సక్రమంగా ఇవ్వకుంటే చర్యలు: జేసీ

ATP: కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటామని జేసీ శివ నారాయణ్ శర్మ హెచ్చరించారు. నేటి నుంచి ఈనెల 15 వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సా.4 నుంచి రా.8 గంటల వరకు బియ్యం, సరుకులు కచ్చితంగా పంపిణీ చేసేలా చూడాలని సీఎస్ఓటీలను ఆదేశించారు. సమస్యలుంటే 85002 92992కు ఫిర్యాదు చేయాలని సూచించారు.