నేడు కడప న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కడప న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది పి.జయరాం రెడ్డి గురువారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుందన్నారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తామన్నారు.