కాళేశ్వరంలో 24 గంటలు ఉచిత వైద్య శిబిరాలు

WLG: సరస్వతి పుష్కరాల్లో భాగంగా భక్తులకు మెరుగైన ఆరోగ్య వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య, అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ 24 గంటలు అందుబాటులో మూడు షిప్టుల్లో ఈ ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు.