చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

MDK: రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.