జయకృష్ణ మూవీపై నయా న్యూస్
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా దర్శకుడు అజయ్ భూపతి 'శ్రీనివాస మంగాపురం' మూవీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకొచ్చింది. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రత్యేక సెట్ వేసి కీలక సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారట. అనంతరం జయకృష్ణపై సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.