కవ్వంపల్లిని పరామర్శించిన ప్రణవ్

కవ్వంపల్లిని పరామర్శించిన ప్రణవ్

KNR: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు రాజేశం ఇటీవల మృతి చెందారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్, కరీంనగర్‌లోని సత్యనారాయణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను ప్రణవ్ పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.