13ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కుమారుడు

13ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కుమారుడు

KRNL: మంత్రాలయం పట్టణం రాఘవేంద్రపురం కాలనీకి చెందిన వినయ్ 2012లో తప్పిపోయాడు. తన కుమారుడు అదృశ్య మయ్యాడని బాలుడి తల్లి అప్పట్లో మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా బాలుడి ఆచూకీ లభించడంతో మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ ఇవాళ తల్లికి అప్పగించారు. 13 ఏళ్ల తర్వాత కొడుకు కనిపించడంతో తల్లి ఆనందంతో మునిగిపోయింది.