అవినిగడ్డ సబ్ ట్రెజరీలో అవినీతి.. ఇద్దరు సస్పెండ్

అవినిగడ్డ సబ్ ట్రెజరీలో అవినీతి.. ఇద్దరు సస్పెండ్

కృష్ణా: అవినిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వెలుగు చూసింది. ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు మళ్లించినట్లు గుర్తించి సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అలాగే, అవినీతిని గుర్తించలేకపోయిన ఎస్‌టిఓ ఆదిశేషుపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.