విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
కోనసీమ: ఐ.పోలవరం మండలంలో ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మండలానికి చెందిన కోడూరి వెంకటేష్ (33) ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం విద్యుత్ పనులు చేస్తుండగా షాక్‌కు గురికావడంతో స్థానికులు టి. కొత్తపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.