టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం
TPT: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 20 లక్షలు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన డా. గీతిక సాయి రూ.10,01,116, అలాగే ACS టెక్నాలజీ సంస్థ రూ.10,01,116 విరాళం ఇచ్చాయి. టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు ఈ డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.