రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ నేతలు

మహబూబ్ నగర్ జిల్లా రైతుల ఆందోళనలతో హోరెత్తింది. యూరియా కష్టాలతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, భూత్‌పూర్ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ధర్నాకు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు.