కేంద్ర హోం మంత్రికి వ్యతిరేకంగా నిరసన

TPT: రేణిగుంటలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నిరసన చేశారు. అంబేడ్కర్ చిత్రపటం పట్టుకొని అమిత్‌షా.. నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.