'మోహన్ బాబు' 50 ఏళ్ల సినీ ప్రస్థానం
'డైలాగ్ కింగ్' పద్మశ్రీ మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.