ఉద్యోగులకు ఆర్టీసీ వార్నింగ్

TG: ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఉద్యోగులకు సూచనలు చేస్తూనే ఆర్టీసీ హెచ్చరికలు జారీ చేసింది. సంస్థను కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒక వర్గం చెప్పే మాటలు విని సమ్మెకు దిగితే తీవ్ర నష్టం తప్పదని, ఉద్యోగుల సంక్షేమం విషయంలో సంస్థ ఏమాత్రం రాజీపడబోదని స్పష్టం చేసింది.